Header Banner

డ్రోన్లే కాదు.. మిలిటరీ సిబ్బందినీ పంపించి! భారత్పై విషం కక్కిన తుర్కియే!

  Wed May 14, 2025 15:38        Politics

భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్థాన్‌కు టర్కీ డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా, తమ సైనిక సిబ్బందిని కూడా పంపిందన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా, 'ఆపరేషన్ సిందూర్' పేరిట జరిగిన ఘటనల్లో టర్కీకి చెందిన సైనికులు పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పాకిస్థాన్, టర్కీల మధ్య రక్షణ ఒప్పందాలు ఊపందుకున్నాయి. భారత్‌పై దాడులే లక్ష్యంగా పాకిస్థాన్‌కు టర్కీ వందల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్ల వినియోగంపై పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు టర్కీ సైనిక నిపుణులను ఇస్లామాబాద్‌కు పంపినట్లు వార్తలు తెలుస్తోంది. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత్ జరిపిన ప్రతిదాడుల్లో ఇద్దరు టర్కీ సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

ఇది కూడా చదవండి: అదృష్టాన్ని పట్టేశాడబ్బా.. ఆ లాటరీపై 15 ఏళ్లుగా ప్రయత్నం! ఎట్టకేలకు రూ.8 కోట్లు గెలిచిన ఇండియన్..

 

ఈ ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ సుమారు 300 నుంచి 400 డ్రోన్లను భారత భూభాగంపైకి ప్రయోగించగా, వాటిని భారత బలగాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఈ డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా, అవన్నీ టర్కీకి చెందిన 'అసిస్ గార్డ్ సోంగర్' రకం డ్రోన్లుగా నిర్ధారించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుంటారని తెలిసిందే. ఆయన అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించినప్పటికీ, ఎర్డోగాన్ మాత్రం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఉగ్రదాడిని ఖండించకపోగా, మృతుల కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. పహల్గామ్ దాడి అనంతరం ముస్లిం దేశాల్లో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచినవి టర్కీ, అజర్‌బైజాన్ మాత్రమే కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. కశ్మీర్ అంశంలో కూడా ఎర్డోగాన్ పలుమార్లు భారత్‌పై విమర్శలు చేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?

 

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #india #pak #Attack #DronesMilitery #TurkeyHelped